ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా ఎవరెస్టు అధిరోహణ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ (31) అరుదైన రికార్డు సృష్టించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా

Published : 23 May 2022 05:01 IST

బెంగాల్‌ మహిళ ఖాతాలో అరుదైన రికార్డు

ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ (31) అరుదైన రికార్డు సృష్టించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే. పియాలీ స్వస్థలం బెంగాల్‌లోని చందన్‌నగర్‌. ఆదివారం ఉదయం 9 గంటలకల్లా ఆమె ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు. అయితే- తాను సాధించిన ఘనతకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని మాత్రం ఆమె ప్రస్తుతానికి పొందలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణం. ఏజెన్సీ ఖాతాలో రూ.12 లక్షలు జమ చేయకపోతే.. ఎవరెస్టును జయించినా గుర్తింపు లభించదని, అంత డబ్బు తన వద్ద లేదని ఇటీవల ఆమె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో ఎవరెస్టు అధిరోహణ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పియాలీ ఏజెన్సీలో జమ చేయాల్సిన డబ్బు కోసం విరాళాలు సేకరిస్తామని చందన్‌నగర్‌ రోటరీ క్లబ్‌ సభ్యులు హామీ ఇచ్చారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం అనుమతులు లభించడంతో పర్వతారోహణపై పియాలీ ముందుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని