భారత్‌లో బీఏ.2.75 వ్యాప్తి పరిమితమే..

అధిక సాంక్రమిక శక్తి ఉన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2కి ఉప రకమైన బీఏ.2.75 వ్యాప్తి భారత్‌లో పరిమితమేనని అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఉపరకం తీవ్రస్థాయికి విస్తరిస్తున్నట్లు లేదా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని పెంచుతున్నట్లు ఇంతవరకు బయటపడలేదని

Published : 06 Jul 2022 06:04 IST

దిల్లీ: అధిక సాంక్రమిక శక్తి ఉన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2కి ఉప రకమైన బీఏ.2.75 వ్యాప్తి భారత్‌లో పరిమితమేనని అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఉపరకం తీవ్రస్థాయికి విస్తరిస్తున్నట్లు లేదా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని పెంచుతున్నట్లు ఇంతవరకు బయటపడలేదని తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ (సార్స్‌-కోవ్‌-2) ఆందోళనకర వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. దీని ఉప రకాల్లో బీఏ.1ని అధిగమించి బీఏ.2 ఆ స్థానంలోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఏ.2.75 కూడా ఇలాంటి ఉప రకమే. బీఏ.2కి రెండో తరంగా చెబుతున్న దీనికి కూడా సాంక్రమిక శక్తి ఎక్కువే. ఇటీవల దేశంలో కేసుల పెరుగుదలకు ఇదీ ఓ కారణం కావచ్చన్న ప్రచారం ఉంది. ఈమేరకు ఇతర ఒమిక్రాన్‌ ఉప రకాల తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం కీలకమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

13 వేలకు పైగా కొత్త కేసులు

దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య మంగళవారం తగ్గింది. గత 24 గంటల్లో (సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉ. 8 గంటల వరకు) 13,086 కొత్త కేసులు బయటపడగా.. 19 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,35,31,650కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,25,242 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని