బుల్లి ట్రాక్టర్‌.. ఇంటర్‌ విద్యార్థి సృష్టి!

పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు రూపొందించిన అతి చిన్న ట్రాక్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి ఉన్న గుర్విందర్‌ అనే ఇంటర్‌ విద్యార్థి ఈమేరకు 3 అడుగుల ట్రాక్టర్‌ను తయారు చేశాడు.

Published : 22 May 2022 06:06 IST

పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు రూపొందించిన అతి చిన్న ట్రాక్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి ఉన్న గుర్విందర్‌ అనే ఇంటర్‌ విద్యార్థి ఈమేరకు 3 అడుగుల ట్రాక్టర్‌ను తయారు చేశాడు. బఠిండాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన గుర్విందర్‌ చిన్న చిన్న మోటర్లను ఉపయోగించి దీన్ని రూపొందించాడు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో కేవలం రూ. 40 వేలతో దీన్ని తయారుచేసినట్లు తెలిపాడు. తాను రూపొందించిన ట్రాక్టర్‌ లీటరుకు 35 కి.మీ.ల మైలేజీ ఇస్తుందని, 4 క్వింటాళ్ల వరకు బరువును మోయగలదని చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని