ప్రతి పురుషుడిని రేపిస్టు అంటే ఎలా?: స్మృతి

ప్రతి వివాహం హింసాత్మకమని నిందించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్‌ అని అనడం

Published : 03 Feb 2022 11:17 IST

దిల్లీ: ప్రతి వివాహం హింసాత్మకమని నిందించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్‌ అని అనడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. వైవాహిక అత్యాచారం అనే అంశంపై రాజ్యసభలో బుధవారం సీపీఐ సభ్యుడు బినయ్‌ విశ్వం సంధించిన అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గృహ హింస నిర్వచనాన్ని సంబంధిత చట్టంలోని సెక్షన్‌ 3 నుంచి ప్రభుత్వం తీసుకుందా? అత్యాచారం నిర్వచనాన్ని ఐపీసీ సెక్షన్‌ 375 నుంచి తీసుకుందా? లేదా? అని ఎంపీ ప్రశ్నించారు. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశాలపై సభలో చర్చించొద్దని స్మృతి ఇరానీ వారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని