CA: 2018 ఘటన కంటే ముందే బాల్ టాంపరింగ్‌కు సీఏ ప్రతినిధులు అనుమతిచ్చారు: జేమ్స్
ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్ వ్యవహారంలో వార్నర్‌ను విలన్ చేశారని ఆరోపించాడు. అలాగే సీఏ ప్రతినిధులు కూడా టాంపరింగ్‌కు అనుమతి ఇచ్చారని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. సాండ్‌పేపర్ గేట్‌గా పిలిచే స్కాంలో వారిద్దరూ నిషేధం ఎదుర్కొని మరీ వచ్చిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని స్మిత్, వార్నర్‌పై వేటు పడింది. తాజాగా డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్ చేసేందుకు ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు అనుమతి ఇచ్చారని ఆరోపించాడు.
‘‘2018లో బాల్ టాంపరింగ్ సంఘటన జరగకముందే ఇలా చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు అనుమతి ఇచ్చారు. 2016లో హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆసీస్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఓడింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఆటగాళ్లను చీవాట్లు పెట్టారు. ‘అప్పుడు బంతిని రివర్స్ స్వింగ్ చేయడమే ఏకైక మార్గం ఉంది. అందుకోసం టాంపరింగ్ చేయాలి’ అని వార్నర్ అనడంతో ‘అదే చేసేయండి’ అంటూ ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. అయితే వారికి సీఏ అనుమతి ఉందో లేదో నేను చెప్పలేను. కానీ వార్నర్ మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియాను కాపాడాడు. అలాగే మిగతా క్రికెటర్లను కూడా రక్షించాడు. ఏదైనా జరిగితే ఎవరూ కూడా కారణాలను వినడానికి ఆసక్తి చూపరని తెలుసు. చివరికి ఇప్పుడు వార్నర్‌ను పెద్ద విలన్‌గా చిత్రీకరించారు’’ అని ఆరోపించాడు. అయితే ఎర్స్కిన్ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి