MSD : ధోనీ.. మా కోసం వెనక్కి వచ్చేయవా..!

ముంబయిపై ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీపై సర్వత్రా ...

Published : 23 Apr 2022 01:46 IST

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ విజ్ఞప్తి

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయిపై ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. వయసు పెరిగినా బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని ధోనీ మరోసారి నిరూపించాడు. ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం సాధించి ఫామ్‌లో ఉన్నానంటూ ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. కీలకమైన మ్యాచ్‌లో మెరుపు షాట్లతో చెన్నైకి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ధోనీని మళ్లీ టీమ్‌ఇండియా జెర్సీలో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఈ సందర్భంగా భారత మాజీ పేసర్‌ ఆర్‌పీ సింగ్‌ కూడా ధోనీకి ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘రానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ధోనీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలి. ఈ విధంగా మనమంతా అతడికి విజ్ఞప్తి చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు. ముంబయిపై చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సిన తరుణంలో ధోనీ రెండు ఫోర్లు, సిక్సర్‌ను బాది చెన్నైని గెలిపించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని