Piyush Chawla: రూ.20 కోట్లు పక్కన పెట్టుకోండి!.. పియూష్‌ చావ్లా

పియూష్‌ చావ్లా! విజయవంతమైన లెగ్‌స్పిన్నర్‌.. లేటు వయసులో ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున సత్తా చాటుతున్నాడు. అయితే తన కొడుకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బౌలర్‌ కాకుండా చూసుకుంటాడట!

Updated : 13 May 2023 07:41 IST

ముంబయి: పియూష్‌ చావ్లా! విజయవంతమైన లెగ్‌స్పిన్నర్‌.. లేటు వయసులో ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున సత్తా చాటుతున్నాడు. అయితే తన కొడుకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బౌలర్‌ కాకుండా చూసుకుంటాడట! ఈ కథ తెలిసిన మరో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ విషయాన్ని యూట్యూబ్‌లో పంచుకున్నాడు. ‘నా ఏడేళ్ల తనయుడు ప్రతి క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తాడు’ అని చావ్లా నాతో చెప్పాడు. ‘క్రికెట్‌ అంటే ఇష్టమనుకుంటా’ అని అన్నా. ‘ఇష్టమే కాదు. ఇంట్లో అందరిని టీవీ ముందు కూర్చొబెడతాడు. నేనేమో నువ్వు బౌలర్‌ కావాలని అస్సలూ అనుకోవద్దు అని చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతి మీద కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్‌ కావాలనేది నా కల. అతడికి ప్రతిరోజూ శిక్షణ ఇప్పిస్తున్నా. నెట్స్‌లో నేనే బౌలింగ్‌ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్‌లో నేను బౌలింగ్‌ చేస్తున్నందుకు రూ. 50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్‌గా మారితే ఓ పదేళ్లలో రూ. 20 కోట్లైనా ఇస్తారు. నా కొడుకు కోసం ఓ 20 కోట్లు పక్కనపెట్టుకోవాలని ముంబయి ఇండియన్స్‌కు చెప్పా’ అని పియూష్‌ తెలిపినట్లు అశ్విన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని