Suryakumar Yadav: కెమెరామెన్‌ సూర్య

టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ కెమెరామెన్‌గా మారిపోయాడు. చేతులను పూర్తిగా కప్పేలా చొక్కా, కళ్లకు అద్దాలు, నెత్తిమీద టోపీ, ముఖానికి మాస్కు ధరించి, ఓ కెమెరా పట్టుకుని మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో జనాల్లోకి వెళ్లిపోయాడు.

Updated : 02 Nov 2023 04:03 IST

ముంబయి: టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ కెమెరామెన్‌గా మారిపోయాడు. చేతులను పూర్తిగా కప్పేలా చొక్కా, కళ్లకు అద్దాలు, నెత్తిమీద టోపీ, ముఖానికి మాస్కు ధరించి, ఓ కెమెరా పట్టుకుని మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో జనాల్లోకి వెళ్లిపోయాడు. అంతకుముందు హోటల్లో సహచర ఆటగాడు రవీంద్ర జడేజా కూడా సూర్యను గుర్తు పట్టలేకపోయాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో బయట జనాలను క్రికెట్‌ గురించి ప్రశ్నలడుగుతూ సూర్య ఓ క్రీడా విలేకరిగా నటించాడు. ఇష్టమైన ఆటగాళ్లు ఎవరూ అని సూర్య అడిగితే.. కొంతమంది రోహిత్‌ శర్మ, మరికొంత మంది విరాట్‌ కోహ్లి తదితర ఆటగాళ్ల పేర్లు చెప్పారు. బ్యాటింగ్‌ ఆర్డర్లో సూర్య ముందు ఆడాలని మరో అభిమాని తెలిపాడు. ‘‘సూర్య ఆట చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అతనెలా ఇలాంటి షాట్లు ఆడతాడోనని అనుకుంటూ ఉంటా. అతను మిస్టర్‌ 360. వాంఖేడేలో అతనికి ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’’ అని ఓ అమ్మాయి చెప్పింది. సూర్య మాస్కు తీయడంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆమెతో ఫోటో దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు