మహిళల హాకీ కెప్టెన్‌గా సలీమా టెటె

గోల్‌కీపర్‌ సవిత పునియా స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్‌గా నియమితురాలైంది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ బెల్జియం, ఇంగ్లాండ్‌ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది.

Published : 03 May 2024 02:02 IST

దిల్లీ: గోల్‌కీపర్‌ సవిత పునియా స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్‌గా నియమితురాలైంది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ బెల్జియం, ఇంగ్లాండ్‌ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. నవ్‌నీత్‌ కౌర్‌ ఉపసారథి. ‘‘కెప్టెన్‌గా నియమితురాలినైనందుకు సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద బాధ్యత. యువ క్రీడాకారిణులు, అనుభవజ్ఞులతో మా జట్టు బలంగా ఉంది’’ అని సలీమా వ్యాఖ్యానించింది. బెల్జియంలో మ్యాచ్‌లు మే 22న ఆరంభమై మే 26న ముగుస్తాయి. భారత జట్టు అర్జెంటీనా, బెల్జియంలో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లాండ్‌ అంచె జూన్‌ 1న ప్రారంభమవుతుంది. అక్కడ భారత్‌.. గ్రేట్‌ బ్రిటన్‌, జర్మనీలతో ఆడుతుంది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ టేబులో భారత్‌ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.

భారత మహిళల హాకీ జట్టు: సలీమా టెటె (కెప్టెన్‌), వైష్ణవి, నవ్‌నీత్‌ కౌర్‌, నేహా, జ్యోతి, బల్జీత్‌ కౌర్‌, మనీషా, లాల్రెమ్‌సియామి, ముంతాజ్‌ ఖాన్‌, సంగీత, దీపిక, షర్మిల, ప్రీతి, వందన, సునేలిత, దీపిక సోరెంగ్‌, నిక్కీ, ఉదిత, ఇషిక, మోనిక, జ్యోతి ఛత్రి, మహిమ, సవిత, బిచ్చు దేవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని