ICC: పిచ్‌ మార్పు సర్వసాధారణం: ఐసీసీ

స్వతంత్ర సలహాదారు ఆండీ అట్కిన్సన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే పిచ్‌ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించింది.

Updated : 16 Nov 2023 09:33 IST

ముంబయి: స్వతంత్ర సలహాదారు ఆండీ అట్కిన్సన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే పిచ్‌ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించింది. సుదీర్ఘంగా సాగే మెగా టోర్నీలో పిచ్‌ మార్పు సర్వసాధారణమని వెల్లడించింది. బుధవారం భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ కోసం వాంఖడే స్టేడియంలో కొత్త పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే భారత స్పిన్నర్లకు అనుకూలించేలా మ్యాచ్‌ను పాత పిచ్‌ మీదకు మార్చినట్లుగా కథనాలు వచ్చాయి.

‘‘సుదీర్ఘంగా సాగే మెగా టోర్నీలో పిచ్‌ ప్రణాళికల్లో మార్పులు సర్వసాధారణం. ఇప్పటికే కొన్నిసార్లు మార్పులు చేశాం. వాంఖడే క్యురేటర్‌ సిఫార్సు మేరకు ఆతిథ్య దేశం సమన్వయంతో పిచ్‌ మార్పు జరిగింది. ఐసీసీ స్వతంత్ర పిచ్‌ సలహాదారుకు మార్పు గురించి తెలియజేశాం. పిచ్‌ బాగాలేదనడానికి ఎలాంటి కారణం లేదు’’ అని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ మ్యాచ్‌ నిర్వహణ నిబంధనల ప్రకారం పిచ్‌ ఎంపిక, తయారీ బాధ్యత ఆతిథ్య సంఘానిదే. నాకౌట్‌ మ్యాచ్‌ను కొత్త పిచ్‌పైనే ఆడించాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని