టీ20 ప్రపంచకప్‌లో రోహితే కెప్టెన్‌

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. ‘‘వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచాం.

Published : 15 Feb 2024 03:27 IST

రాజ్‌కోట్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. ‘‘వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచాం. 2024 (టీ20 ప్రపంచకప్‌)లో బార్బడోస్‌ (ఫైనల్‌ వేదిక)లో రోహిత్‌ సారథ్యంలో భారత పతాకం ఎగురవేస్తాం’’ అని షా అన్నాడు. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌కు విండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా స్టేడియంగా మార్చారు. ఈ కార్యక్రమంలో జై షాతో పాటు.. మాజీ కెప్టెన్లు గావస్కర్‌, కుంబ్లే, ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌, సిరాజ్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు