నేడు ఫ్రాన్స్‌ చేరనున్న ఒలింపిక్‌ జ్యోతి

ఒలింపిక్‌ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్‌ 16న గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్‌ను దాటి మార్సెకి చేరువైంది.

Updated : 09 May 2024 00:49 IST

పారిస్‌: ఒలింపిక్‌ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్‌ 16న గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్‌ను దాటి మార్సెకి చేరువైంది. బెలిమ్‌ అనే ఓడ ద్వారా రిలేను ఫ్రాన్స్‌కు తీసుకొచ్చారు. బుధవారం జ్యోతిని అథ్లెట్లు మార్సెలో ప్రదర్శనగా తీసుకెళ్లనున్నారు. ఫ్రాన్స్‌లో వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత జులై 14న ఆతిథ్య నగరం పారిస్‌ నగర వీధుల్లోకి ప్రవేశిస్తుంది. మళ్లీ అక్కడ నుంచి బయల్దేరి నాన్‌తెర్‌.. సీన్‌ సెయింట్‌ డెన్నిస్‌ తదితర ప్రాంతాలను చుట్టి సీన్‌ నది గుండా జులై 26 కల్లా పారిస్‌కు వస్తుంది. ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం రోజు సాయంత్రం 80కిపైగా బోట్లలో అథ్లెట్లు సీన్‌ నదిలో జ్యోతితో సుమారు 6 కిలోమీటర్లు పరేడ్‌ చేస్తారు. సీన్‌ నది దగ్గర మొదలై ఈఫిల్‌ టవర్‌తో ముగిసే ప్రారంభోత్సవ కార్యక్రమం నాలుగు గంటలకు పైగా సాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు