వారిద్దరి విషయంలో ద్రవిడ్‌కు ప్రణాళికలు ఉండాలి

భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విషయంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు.

Updated : 09 May 2024 00:49 IST

దిల్లీ: భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విషయంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. అప్పుడే టీ20 ప్రపంచకప్‌లో స్టార్‌ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టొచ్చని తెలిపాడు. ‘‘జట్టులో చాలామంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడు ప్రణాళికలు రచించుకోవడం మరిచిపోతుంటాం. అంతా వాళ్లే చూసుకుంటారని అనుకుంటాం. కొన్నిసార్లు అంచనాల్ని అందుకుంటారు కూడా. అయితే జట్టులో వివ్‌ రిచర్డ్స్‌ లేదా విరాట్‌ కోహ్లి ఎవరున్నా.. చీఫ్‌ కోచ్‌గా వాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నారో చెప్పాలి. ప్రస్తుత భారత్‌ పరిస్థితే గతంలో చాలా జట్లకు ఎదురైంది. 1987 ప్రపంచకప్‌లో పాల్గొన్న వెస్టిండీస్‌ ఒక ఉదాహరణ. గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. ఎంతోమంది యువ ప్రతిభావంతులు ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో సిద్ధమవ్వాలన్నది ద్రవిడ్‌కు నా సూచన. సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో నంబరులో బ్యాటింగ్‌ చేయాలి. టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్య ఒకడు. ప్రస్తుత భారత జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఉంది. ఫైనల్లో వెస్టిండీస్‌, భారత్‌ తలపడాలని కోరుకుంటున్నా’’ అని లారా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు