కోల్‌కతా బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌

టీమ్‌ఇండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తమ సహాయక బృందంలోకి తీసుకుంది. బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది.

Published : 15 Jan 2022 03:01 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తమ సహాయక బృందంలోకి తీసుకుంది. బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ‘‘భరత్‌ అరుణ్‌ బౌలింగ్‌ కోచ్‌గా చేరడం ఆనందంగా ఉంది. పటిష్టమైన కోల్‌కతా సహాయక బృందానికి అరుణ్‌ అనుభవం, నైపుణ్యం ఎంతగానో పనికొస్తుంది’’ అని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్‌ తెలిపాడు. కోల్‌కతా వంటి అత్యంత విజయవంతమైన జట్టులో భాగం కావడం ఆనందంగా ఉందని అరుణ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని