ఐసీసీ టీ20 జట్లలో స్మృతి మాత్రమే

2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ పురుష, మహిళల టీ20 జట్లలో కలిపి భారత్‌ నుంచి ఒక్కరికే చోటు దక్కింది. మహిళల జట్టులో స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు స్థానం లభించింది. గత ఏడాది ఆమె 9 టీ20ల్లో 31.87 సగటు,

Published : 20 Jan 2022 04:30 IST

పురుషుల్లో ఒక్కరికీ దక్కని చోటు

దుబాయ్‌: 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ పురుష, మహిళల టీ20 జట్లలో కలిపి భారత్‌ నుంచి ఒక్కరికే చోటు దక్కింది. మహిళల జట్టులో స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు స్థానం లభించింది. గత ఏడాది ఆమె 9 టీ20ల్లో 31.87 సగటు, 131.44 స్ట్రైక్‌ రేట్‌తో 255 పరుగులు చేసి భారత మహిళల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 25 ఏళ్ల మంధాన నిరుడు రెండు అర్ధశతకాలు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 జట్టుకు ఇంగ్లిష్‌ క్రికెటర్‌ నటాలీ సీవర్‌ కెప్టెన్‌గా ఎంపికైంది. పురుషుల జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌నే ఐసీసీ జట్టుకు సారథిగా ప్రకటించారు. అత్యధికంగా పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ముగ్గురికి ఈ జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని