కష్టాల్లో కివీస్‌

ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌.. నామమాత్రమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ముందు మెరుగైన లక్ష్యాన్ని నిలిపేందుకు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు 168/5తో నిలిచింది. లేథమ్‌ (7

Published : 26 Jun 2022 01:52 IST

లీడ్స్‌: ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌.. నామమాత్రమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ముందు మెరుగైన లక్ష్యాన్ని నిలిపేందుకు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు 168/5తో నిలిచింది. లేథమ్‌ (76), విలియమ్సన్‌ (48) రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించడంతో ఒక దశలో 125/1తో పటిష్ట స్థితిలో నిలిచిన కివీస్‌.. పాట్స్‌ (2/20) సహా ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించడంతో 36 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆట ఆఖరుకు మిచెల్‌ (4), బ్లండెల్‌ (5) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 264/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 360 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఒవర్టన్‌ (97) సెంచరీ ముంగిట ఔటైపోగా.. బెయిర్‌స్టో 162 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. బ్రాడ్‌ (42) విలువైన పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని