ధోని స్ఫూర్తితో..

బుమ్రా ఇంతకుముందెప్పుడూ, ఏ స్థాయిలో కెప్టెన్‌గా పనిచేయలేదు. ఇప్పుడు నేరుగా టీమ్‌ఇండియాకే నాయకత్వం వహించబోతున్నాడు. కరోనాతో రోహిత్‌ దూరం కావడంతో ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టులో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Published : 01 Jul 2022 03:43 IST

బర్మింగ్‌హామ్‌: బుమ్రా ఇంతకుముందెప్పుడూ, ఏ స్థాయిలో కెప్టెన్‌గా పనిచేయలేదు. ఇప్పుడు నేరుగా టీమ్‌ఇండియాకే నాయకత్వం వహించబోతున్నాడు. కరోనాతో రోహిత్‌ దూరం కావడంతో ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టులో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కపిల్‌దేవ్‌ తర్వాత ఓ ఫాస్ట్‌బౌలర్‌ భారత టెస్టుకు కెప్టెన్‌ కావడం ఇదే తొలిసారి. అనుకోకుండా సారథ్య అవకాశం దక్కించుకున్న బుమ్రా ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమవుతున్నాడు. జట్టుకు నాయకత్వం వహించడం తన కెరీర్‌లో అతి పెద్ద ఘనత అని అన్నాడు. ఎలాంటి కెప్టెన్సీ అనుభవం లేకుండా నేరుగా భారత జట్టు కెప్టెనై, ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ధోని నుంచి అతడు స్ఫూర్తి పొందుతున్నాడు. ‘‘బాధ్యతలకు నేనెప్పుడూ సిద్ధమే. ఓసారి ధోనీతో జరిపిన సంభాషణ నాకింకా గుర్తుంది. భారత్‌కు నాయకత్వం వహించడానికి ముందు తాను ఎప్పుడూ ఏ జట్టూకూ కెప్టెన్‌గా లేనని చెప్పాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ఇప్పుడు అతడికి పేరు. కాబట్టి ఇప్పుడు నా దృష్టంతా నేను జట్టుకు ఎలా ఉపయోగపడగలనన్న దానిపైనే. ఇంతకుముందు ఏం చేశానన్నదానిపై కాదు’’ అని అన్నాడు. ‘‘టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నా కల. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం నా కెరీర్‌లోనే పెద్ద ఘనత. ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నాకు చాలా నమ్మకముంది’’ అని బుమ్రా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని