ధావన్‌ సారథ్యంలో విండీస్‌కు

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేకుండానే టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ శిఖర్‌ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Updated : 07 Jul 2022 07:23 IST

దిల్లీ: రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేకుండానే టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ శిఖర్‌ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, హార్దిక్‌ పాండ్యలకు విశ్రాంతినిచ్చారు. ఈనెల 22, 24, 27వ తేదీల్లో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు జరుగుతాయి. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికవని దీపక్‌ హుడా, సంజు శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అవేష్‌ఖాన్‌లకు విండీస్‌ పర్యటనకు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న టీమ్‌ఇండియా ఈనెల 17 వరకు మ్యాచ్‌లు ఆడుతుంది. మూడేసి టీ20, వన్డే మ్యాచ్‌ల్లో బరిలో దిగుతుంది. ఆ వెంటనే వెస్టిండీస్‌కు బయల్దేరుతుంది. 

టీమ్‌ఇండియా: ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని