బ్రావో @ 600

టీ20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఘనత సాధించాడు. ‘ది హండ్రడ్‌’ టోర్నీలో నార్తన్‌ సూపర్‌ఛార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్‌ ఇన్విన్స్‌బుల్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా

Published : 13 Aug 2022 03:07 IST

లండన్‌: టీ20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఘనత సాధించాడు. ‘ది హండ్రడ్‌’ టోర్నీలో నార్తన్‌ సూపర్‌ఛార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్‌ ఇన్విన్స్‌బుల్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. డ్వేన్‌ 516 ఇన్నింగ్స్‌ల్లో 600 వికెట్లు మార్క్‌ అందుకున్నాడు. సామ్‌ కరన్‌ను ఔట్‌ చేసి 600 వికెట్లు సాధించిన తర్వాత కాళ్లు, చేతులు చిత్రంగా ఆడిస్తూ బ్రావో సంబరాలు చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని