భారత్‌ మ్యాచ్‌లు 141

వచ్చే అయిదేళ్లలో టీమ్‌ఇండియా 141 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. బుధవారం ఐసీసీ 2023-2027 భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ను విడుదల చేసింది. ఈ అయిదేళ్ల కాలంలో టీమ్‌ఇండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టీ20లు

Published : 18 Aug 2022 08:39 IST

2023-27 ఎఫ్‌టీపీ విడుదల

దిల్లీ: వచ్చే అయిదేళ్లలో టీమ్‌ఇండియా 141 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. బుధవారం ఐసీసీ 2023-2027 భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ను విడుదల చేసింది. ఈ అయిదేళ్ల కాలంలో టీమ్‌ఇండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. వన్డేల కంటే టీ20 మ్యాచ్‌లే ఎక్కువ ఆడనుండటం గమనార్హం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో టీమ్‌ఇండియా అయిదేసి మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లలో తలపడనుంది. వచ్చే ఏడాది అక్టోబరు- నవంబరులో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా 27 వన్డేల్లో బరిలో దిగనుంది. ఎఫ్‌టీపీలో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. 2023-2027 ఎఫ్‌టీపీలో 12 జట్లు 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ప్రస్తుత ఎఫ్‌టీపీలో 694 మ్యాచ్‌లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 777కు పెరిగింది. అందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు ఉన్నాయి. ఆసీస్‌ 40, ఇంగ్లాండ్‌ 43 టెస్టులు ఆడనున్నాయి.

ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ ఢీ 

2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాక్‌.. ఆ ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సమయంలోనే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్వహించనుంది. మార్చి నుంచి జూన్‌ వరకు రెండున్నర నెలల పాటు ఐపీఎల్‌ జరుగుతుంది. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పీఎస్‌ఎల్‌ను నిర్వహించే పాక్‌.. 2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ కారణంగా పదో సీజన్‌ను మార్చి- మే మధ్యలో జరపనుంది. ఐపీఎల్, పీఎస్‌ఎల్‌ ఒకేసారి జరుగనుండటంతో రెండు లీగ్‌లలో ఆడే ఆటగాళ్లు ఎటువైపు వెళ్తారన్నది చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని