భారత్‌ ఖాతాలో మూడు స్వర్ణాలు

స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌ పంచ్‌ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి.

Published : 27 Nov 2022 01:58 IST

దిల్లీ: స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌ పంచ్‌ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి. విశ్వనాథ్‌ (48 కేజీ), వంశజ్‌ (63.5 కేజీ), దేవిక (52 కేజీ) పసిడి పతకాలతో మెరిశారు. రోనెల్‌ (ఫిలిప్ఫీన్స్‌)ను విశ్వనాథ్‌ ఓడించగా.. డెముర్‌ (జార్జియా)పై వంశజ్‌ నెగ్గాడు. సకాయ్‌ (జపాన్‌) చేతిలో పరాజయం పాలైన ఆశిష్‌ (54 కేజీ) రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో లౌరెన్‌ (ఇంగ్లాండ్‌)పై దేవిక పైచేయి సాధించగా.. గనెవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో తలొంచిన భావ్నాశర్మ (48 కేజీ) రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడు స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించిన భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.  మహిళల విభాగంలోనే మనకు ఎనిమిది పతకాలు దక్కడం విశేషం. రవీనా (63 కేజీ), కీర్తి (81 కేజీలపైన) పసిడి పోరుకు అర్హత సాధించిన నేపథ్యంలో మరో రెండు స్వర్ణాలు ఖాతాలో చేరే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు