విజృంభించిన స్టార్క్‌, కమిన్స్‌

వెస్టిండీస్‌తో తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు మరింత బిగిసింది. స్టార్క్‌ (3/51), కమిన్స్‌ (3/34) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌట్‌ చేసిన కంగారూ జట్టు 315 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

Published : 03 Dec 2022 02:21 IST

వెస్టిండీస్‌ 283 ఆలౌట్‌

పెర్త్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు మరింత బిగిసింది. స్టార్క్‌ (3/51), కమిన్స్‌ (3/34) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌట్‌ చేసిన కంగారూ జట్టు 315 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 74/0తో రెండో రోజు, శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కరీబియన్‌ జట్టు.. కాసేపటికే తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (51) వికెట్‌ కోల్పోయింది. బోనర్‌ (16) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ స్థితిలో కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (64), బ్లాక్‌వుడ్‌ (36)తో కలిసి విండీస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. బ్రాత్‌వైట్‌ వెనుదిరిగినా.. హోల్డర్‌ (27), బ్రూక్స్‌ (33)తో కలిసి బ్లాక్‌వుడ్‌ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పవడంతో విండీస్‌ ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. ఒక దశలో 245/4తో మెరుగైన స్థితిలో ఉన్న కరీబియన్‌ జట్టు.. స్టార్క్‌, కమిన్స్‌, లైయన్‌ (1/35) ధాటికి 38 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి 300ల్లోపు స్కోరుకే పరిమితమైంది. విండీస్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆట చివరికి 29/1తో నిలిచింది. ఖవాజా (5) ఔట్‌ కాగా.. వార్నర్‌ (18), లబుషేన్‌ (3) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 598/4 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని