Cricket: క్రికెట్‌లో కొత్త నిబంధన.. అమలు ఎప్పట్నుంచంటే?

క్రికెట్‌ (Cricket)లో రేపటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ‘స్టాప్‌ క్లాక్’ పేరుతో సరికొత్త నిబంధనను ఐసీసీ (ICC) ప్రవేశపెట్టనుంది.

Updated : 11 Dec 2023 20:44 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ (Cricket)లో రేపటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ‘స్టాప్‌ క్లాక్’ పేరుతో సరికొత్త నిబంధనను ఐసీసీ (ICC) ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తన తర్వాతి ఓవర్‌లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలానే జరిగితే.. బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ జట్టు స్కోరులో యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఆట వేగాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. డిసెంబరు 12 నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభంకానున్న ఐదు టీ20 సిరీస్ నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని