Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..

ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి (Varanasi)లో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్నారు.

Updated : 23 Sep 2023 12:10 IST

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని నెలల్లో దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి (Varanasi)లో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

స్టేడియం విశేషాలు 

ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్‌ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్‌ నిర్మించనున్నారు. గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్‌ షీట్‌లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సూమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది. దీని నిర్మాణం పూర్తి అయితే కాన్పూర్‌, లఖ్‌నవూల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మూడో అంతర్జాతీయ స్టేడియం కానుంది. వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్‌కు సమీపంలో నిర్మించునున్న ఈ స్టేడియం 2025, డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు