India vs Australia: ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించింది. రుతురాజ్‌ గైక్వాడ్ (8) మినహా మిగతా బ్యాటర్లందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

Updated : 24 Sep 2023 19:02 IST

ఇందౌర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించింది. రుతురాజ్‌ గైక్వాడ్ (8) మినహా మిగతా బ్యాటర్లందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్‌పై భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్‌డౌన్‌ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్ (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకాలు సాధించారు. ఇషాన్‌ కిషన్‌ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు గిల్, శ్రేయస్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. ఆసీస్‌ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్‌వుడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారత్‌ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఓవర్‌ టు ఓవర్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని