Dinesh Karthik: రోహిత్‌ శర్మ, కోహ్లీ అతడి బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడరు: దినేశ్‌ కార్తిక్

తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ ఎవరనే విషయాన్ని దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik)వెల్లడించాడు. 

Published : 14 Feb 2023 15:58 IST

ఇంటర్నెట్ డెస్క్: యువ క్రికెటర్లతో పోటీపడి మరీ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఆ మెగా టోర్నీలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. తర్వాత జట్టులో చోటు కోల్పోయి ప్రస్తుతం కామెంటేటర్‌గా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ షోలో పాల్గొని మాట్లాడాడు. ఈ క్రమంలో తాను  నెట్స్‌లో ఎదుర్కొన్న కఠిన బౌలర్‌ మహమ్మద్‌ షమి అని వెల్లడించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ని ఎదుర్కోవడం ‘టార్చర్’అని చెప్పాడు. భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma, విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కూడా నెట్స్‌లో షమి బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బందిపడతారని పేర్కొన్నాడు.

‘షమి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నేను ‘టార్చర్‌ షమి’ అని చెబుతా. ఎందుకంటే నా కెరీర్‌ మొత్తంలో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే. నెట్స్‌లో షమి బౌలింగ్‌లో చాలాసార్లు ఆడాను. కొన్ని మ్యాచ్‌ల్లో ఔట్‌ కూడా చేశాడు. అతడి నెట్స్‌లో చాలా కఠినమైన బంతులు విసురుతాడు. నేనొక్కడినే ఇలా ఇబ్బంది పడుతున్నానా? అనే అనుమానంతో షమి బౌలింగ్‌ గురించి విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ అడిగాను. వాళ్లు కూడా షమి బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి ఇష్టపడమని చెప్పారు’ అని వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని