Nikhat Zareen: నిఖత్ జరీన్ పసిడి పంచ్.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్!
మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (wWBC)లో భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది.
దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్(wWBC)లో భారత్ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది.
దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు. గతేడాది 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్.. ఈసారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుసుకొని చరిత్ర సృష్టించారు. శనివారం భారత్ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్ (మంగోలియా)ను చిత్తుచేయగా.. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటీ 4-3తో వాంగ్ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది.
గతంలో నిఖత్ మెరుపులు..
🥊 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
🥊 2014 నేషన్స్ కప్‌లో స్వర్ణం
🥊 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
🥊 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం
🥊 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో రజతం
🥊 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి
🥊 2022 ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
🥊 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం
🥊 2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్