Best catches: విండీస్‌ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!

 వెస్టిండీస్‌ ఇటీవల వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది. తాజాగా బుధవారం జమైకాలోని సబీనా పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన  

Published : 13 Aug 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వెస్టిండీస్‌ ఇటీవల వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది. తాజాగా బుధవారం జమైకాలోని సబీనా పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ పరాజయం పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు సంచలన ఫీల్డింగ్ చేశారు. విండీస్‌ ఫీల్డర్లు మూడు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొన్నారు. తొలుత న్యూజిలాండ్ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ ఆఫ్‌సైడ్‌ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఉన్న షిమ్రాన్ హెట్మెయర్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. ఆ తర్వతా మరో ఓపెనర్‌ డివాన్‌ కాన్‌వే క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ డివాన్‌ థామస్‌ అద్భుతంగా అందుకొన్నాడు. ఇక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో 47 పరుగులతో క్రీజ్‌లో ఉన్న కేన్‌ విలియమ్సన్‌ స్క్వేర్‌లెగ్‌ వైపు షాట్‌ ఆడాడు. అయితే, బౌండరీ లైన్‌ వద్ద  హేడెన్ వాల్ష్ జూనియర్ మెరుపు వేగంతో డైవ్‌చేస్తూ గాల్లో ఉన్న బంతిని పట్టేశాడు. ఈ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ మూడు వికెట్లు ఒడెన్‌ స్మిత్‌ బౌలింగ్‌లోనే రావడం విశేషం.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని