ICC World Cup: వన్డే ప్రపంచకప్‌.. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ డేట్‌ ఫిక్స్‌!

ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం భారత్‌లో పర్యటించడానికి పాకిస్థాన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

Updated : 10 May 2023 20:21 IST

దిల్లీ: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌ మధ్య భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)నకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ బయటికొచ్చింది. వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌లో పర్యటించడానికి పాకిస్థాన్‌ అంగీకరించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ను అక్టోబర్‌ 15న నిర్వహించే అవకాశం ఉంది.  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోది స్టేడియం వేదికగా అక్టోబర్ 5న టోర్నీ ఆరంభ మ్యాచ్‌ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుందట. ఫైనల్‌ కూడా ఈ స్టేడియంలోనే నిర్వహిస్తారని సమాచారం. ఐపీఎల్-16 సీజన్‌ పూర్తయి, సభ్యదేశాలు ఆమోదం తెలిపిన అనంతరం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందట.

ప్రపంచకప్‌ కంటే ముందు (సెప్టెంబర్‌ 2) జరిగే ఆసియాకప్‌ షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. కానీ, రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయంపై కొన్నాళ్ల నుంచి  ప్రతిష్టంభన నెలకొంది. ఆసియా కప్‌ కోసం టీమ్‌ఇండియా పాక్‌లో పర్యటించకుంటే వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని పాక్‌ స్పష్టం చేసింది. అనంతరం మారిన పరిణామాలతో పాకిస్థాన్‌.. బీసీసీఐ ముందు తలొగ్గినట్లు కనిపిస్తోంది. ఆసియా కప్‌ను శ్రీలంకలో నిర్వహించే అవకాశాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని