Labuschagne:ఐపీఎల్‌లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
ఆసీస్ బ్యాటర్ లబుషేన్ ఐపీఎల్ (IPL) లో తన ఫేవరెట్ టీమ్ పేరుని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఐపీఎల్‌లో తన ఫేవరెట్ టీమ్ ఏదో వెల్లడించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనకు ఇష్టమైన జట్టు అని లబుషేన్ పేర్కొన్నాడు. ట్విటర్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో అభిమానులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ (RCB) తన ఫేవరేట్ టీమ్ అని చెప్పిన లబుషేన్.. ఈ లీగ్‌లో ఆడే అవకాశం లభిస్తే విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయాలనుందన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పండి అని అడగ్గా.. 'ఒక వర్డ్ కంటే ఎక్కువని, అతని బ్యాటింగ్ చూస్తూ ఆస్వాదిస్తాను’ అని అని చెప్పాడు.
తాను ఎదుర్కొన్న బౌలర్లలో బెస్ట్ స్పిన్నర్ ఎవరు? అని ప్రశ్నించగా.. రవిచంద్రన్ అశ్విన్ అని ఠక్కున చెప్పాడు. టీ20ల ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ రిజ్వాన్‌లలో ఒకరిని ఎంచుకోమనగా.. తనకు సూర్యకుమార్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో ఎవరి బౌలింగ్‌లో ఆడి ఉంటే బాగుంటుందనిపించిన బౌలర్ పేరు చెప్పాలనగా.. డేల్ స్టెయిన్, షాన్ పొలాక్, గ్లెన్ మెక్‌గ్రాత్ అని సమాధానమిచ్చాడు. భారత్‌లో మీకు నచ్చిన వంటకం ఏంటని ప్రశ్నించగా... బటర్ చికెన్, స్పినాచ్, చీజ్ తో తయారుచేసే నాన్ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 వేలంలో లబుషేన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే, ఏ ఫ్రాంచైజీ కూడా అతడిపై ఆసక్తి చూపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో