లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్‌ రజతం.. శ్రీయ రాజేశ్‌ కాంస్యం గెలుచుకున్నారు.

Published : 27 Apr 2024 02:23 IST

దుబాయ్‌: ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్‌ రజతం.. శ్రీయ రాజేశ్‌ కాంస్యం గెలుచుకున్నారు. 800 మీటర్ల పరుగులో లక్షిత (2 నిమిషాల 7.10 సెకన్లు) రెండో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల పరుగులో శ్రీయ (59.20 సెకన్లు) మూడో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో సచిన్‌ (45 నిమిషాల 50.56 సె) నాలుగో స్థానంలో నిలవగా... హిమాంశు అనర్హతకు గురయ్యాడు. మహిళల హ్యామర్‌త్రోలో నందిని  (56.99 మీ), అనుష్క (55.81 మీ) అయిదు, ఆరో స్థానాలతో సరిపెట్టుకున్నారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సబిత టొప్పో (14.10 సె), ఉన్నతి (13.72 సె) పతక రౌండ్‌కు అర్హత సాధించారు. 4×100 మీటర్ల రిలేలో భారత జట్టు (40.43 సె) కూడా పతకం కోసం పోటీపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని