సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా

71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ రికీ పాంటింగ్‌! శతకం చేసిన ప్రతి బ్యాట్‌ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట.

Published : 27 Apr 2024 02:22 IST

దిల్లీ: 71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ రికీ పాంటింగ్‌! శతకం చేసిన ప్రతి బ్యాట్‌ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. ఈ విషయాన్ని రికీ తాజాగా దిల్లీ యువ క్రీడాకారులకు క్రికెట్‌ కిట్‌ను పంపిణీ చేసిన సందర్భంలో వెల్లడించాడు. ‘‘మీరు నమ్మినా నమ్మకపోయినా నేను తొలి అంతర్జాతీయ శతకం చేసిన బ్యాట్‌ దగ్గర నుంచి కెరీర్‌లో చివరిసారి సెంచరీ చేసిన బ్యాట్‌ వరకు అన్నీ నాతోనే ఉన్నాయి. వాటిపై స్టిక్కర్లు కూడా చెక్కుచెదరలేదు. సెంచరీ సాధించిన ఏడాది.. ప్రత్యర్థి.. తేదీతో సహా బ్యాట్‌పై రాసుకున్నాను. నాకది ఓ అలవాటు. ఈ బ్యాట్‌లన్నిటిని అందరికి కనిపించేలా ఇంట్లో పెట్టుకోలేదు. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో భద్రపరిచా’’ అని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ పాంటింగ్‌ చెప్పాడు. తాను కూడా తొలి బ్యాట్‌ను ఇప్పటికి దాచుకున్నానని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు