సూర్య, బుమ్రానే కీలకం

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

Published : 27 Apr 2024 02:24 IST

దిల్లీ: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రాణించాలంటే సూర్యకుమార్‌ యాదవ్‌, బుమ్రా రాణించడంపై ఆధారపడి ఉంది. వీళ్లిద్దరూ ఏ దశలోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగలరు. టీమ్‌ఇండియాలో చాహల్‌ లాంటి ఓ లెగ్‌స్పిన్నర్‌ కూడా ఉండడం కీలకం’’ అని యువీ తెలిపాడు. ఐపీఎల్‌లో మెరిసిన దినేశ్‌ కార్తీక్‌ను వికెట్‌కీపర్‌గా ఎంపిక చేస్తే మంచిదేనని.. కానీ అతడికి తుది జట్టులో కచ్చితంగా స్థానం కల్పించేలా ఉంటేనే ప్రపంచకప్‌కు తీసుకెళ్లాలని యువీ అన్నాడు. ‘‘ప్రస్తుతం కార్తీక్‌ సత్తా చాటుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ రేసులో ఉన్నాడు. అతడిని ఎంపిక చేస్తే మంచిదే. 2022 వన్డే ప్రపంచకప్‌ మాదిరి ఎంపిక చేసి ఆడించకపోతే వృథా. యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబెను కూడా టీమ్‌ఇండియాలో చూడాలనుకుంటున్నా. అతడు గేమ్‌ ఛేంజర్‌’’ అని యువీ పేర్కొన్నాడు. రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లిలకు తమ భవిష్యత్‌ గురించి నిర్ణయించుకునే హక్కు ఉందని.. ఎప్పుడు రిటైర్‌ అవ్వాలన్నది వారి ఇష్టమని అతనన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని