సురేఖ జోడీకి పతకం ఖాయం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు నాలుగో పతకం ఖాయం చేసింది.

Updated : 27 Apr 2024 11:28 IST

ఫైనల్లో భారత మిక్స్‌డ్‌ జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీ

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు నాలుగో పతకం ఖాయం చేసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ- అభిషేక్‌ జోడీ 155-151తో ఆండ్రియా బెకెరా- మాక్సిమో మెండెజ్‌ (మెక్సికో) జంటపై విజయం సాధించింది. శనివారం స్వర్ణం కోసం జరిగే ఫైనల్లో ఎస్తోనియా జట్టుతో భారత్‌ తలపడుతుంది. ఇప్పటి వరకు కాంపౌండ్‌ పురుషులు, మహిళలు, మిక్స్‌డ్‌.. రికర్వ్‌ పురుషుల విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో  అంకిత బాకత్‌- బొమ్మదేవర ధీరజ్‌ జోడీ 0-6 (38-39, 35-36, 36-38)తో టాప్‌ సీడ్‌ లిమ్‌- కిమ్‌ వూజిన్‌ (కొరియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. కాంస్య పతకం కోసం జరిగే పోరులో మెక్సికో భారత్‌ పోటీపడుతుంది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్‌లో దీపిక 6-4 (27-28, 27-27, 29-28, 29-27, 28-28)తో జియోన్‌ హున్‌యంగ్‌ (కొరియా)పై గెలుపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు