Robin Uthappa: రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్‌ ఉతప్ప

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, 2007లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు రాబిన్‌ ఉతప్ప రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత క్రికెట్‌కు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు.........

Published : 14 Sep 2022 20:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, 2007లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు రాబిన్‌ ఉతప్ప రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ‘దేశానికి, నా రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. కానీ ఏదో ఒకరోజు వీటికి వీడ్కోలు పలకాల్సిందే. భారత క్రికెట్‌కు అన్ని పార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.

భారత్‌ తరఫున 46 వన్డేలు ఆడిన ఉతప్ప 934 పరుగులు చేశాడు. 13 టీ20ల్లో 249 రన్స్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కంటే ఉతప్ప భారత టీ20 లీగ్‌లోనే మెరిశాడు. 2012, 2014లో కప్పు సాధించిన కోల్‌కతా జట్టులో సభ్యుడు. గత (2021లో) టైటిల్‌ కొట్టిన చెన్నై జట్టులోనూ రాబిన్ సభ్యుడు. ఓపెనర్‌గా దిగే ఉతప్ప ఎన్నో ఉత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని