RCB - Virat: ఐపీఎల్ ఒక్కసారీ గెలవలేదు... అయినా నాలో అదే ఉత్సాహం: విరాట్
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, బెంగళూరు ఫ్రాంచైజీ కీ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆ ఫ్రాంచైజీ మహిళా జట్టుతో మాట్లాడాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సమావేశం వీడియోను RCB టీమ్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘నేను 15 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాను. అయితే ఇప్పటివరకు మన టీమ్ విజేతగా నిలవలేదు. అయినా ఏటా ఉత్సాహంగా టోర్నీలో పాల్గొంటాను. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నమెంట్‌లో శాయశక్తులా శ్రమిస్తాను’’ అని చెప్పాడు విరాట్ కోహ్లీ. బుధవారం యూపీతో జరిగిన మ్యాచ్‌కు ముందు బెంగళూరు మహిళా జట్టులో స్ఫూర్తి నింపేలా విరాట్ మాట్లాడిన ఓ వీడియోను ఆర్‌సీబీ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, విమర్శలను విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ సందర్భంగా టీమ్ సభ్యులకు వివరించి చెప్పాడు. అలాగే మున్ముందు విజయాలతో ముందుకు సాగాలని కీలక సూచనలు చేశాడు.
‘‘ప్లేఆఫ్స్ వెళ్లేందుకు తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. నాకౌట్ స్టేజ్‌కు వెళ్లేందుకు ఉన్న ఒక్క శాతం ఛాన్స్‌ను మెరుగుపర్చుకోవాలి’’ జట్టు పరిస్థితి గురించి టీమ్ సభ్యులకు మార్గనిర్దేశం చేశాడు. ‘‘మనం గెలిస్తే గ్రేట్.. ఒకవేళ ఐపీఎల్ గెలిచినట్లైతే ఎంతో సంతోషంగా ఉండేవాడిని. కానీ, అలా జరగలేదు. అయినా సరే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటా. ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలవలేకపోయాం. అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అభిమానులు కలిగిన జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్‌సీబీనే అని నేను నమ్ముతా. దీనింతటికి కారణం ఆర్‌సీబీ తరఫున కమిట్‌మెంట్‌తో ఆడటమే’’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.
అభిమానులు గమనిస్తూనే ఉంటారు
‘‘ప్రతి సంవత్సరం కప్ సాధిస్తామనే గ్యారంటీ ఇవ్వలేకపోయినా.. నాణ్యమైన ఆటను మాత్రం మీరు చూసేలా చేస్తామని 110 శాతం గ్యారంటీ అభిమానులకు ఇవ్వగలం. ఫలితాల గురించి ఆలోచించకుండా విజయాల కోసం ముందుకు సాగిపోవాలి. ఒత్తిడిని అధిగమించి రాణించాలి. అభిమానులు నిరంతరం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు అనే విషయం గుర్తుంచుకోండి. మహిళా ప్రీమియర్ లీగ్ ఆడటం మీకు దక్కిన అద్భుతమైన అవకాశం. ఆటను ప్రేమిస్తూ ముందుకు సాగండి. ఇప్పటికీ మీ చేతుల నుంచి అవకాశం దాటిపోలేదు’’ అని విరాట్ సూచించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ. ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో ఒక్కసారి కూడానూ విజేతగా నిలవలేకపోయింది. టాప్ ఆటగాళ్లతో కూడిన జట్టు అయినప్పటికీ కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లోనూ ఆర్‌సీబీ ఉమెన్ టీమ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఎట్టకేలకు యూపీ వారియర్స్‌పై విజయంతో పాయింట్ల ఖాతాను తెరిచింది. తద్వారా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగింది. చివరి రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి.. మిగతా జట్ల ఫలితాల బట్టి బెంగళూరు ప్లే ఆఫ్ ఛాన్స్‌లు ఆధారపడి ఉన్నాయి. విరాట్ మాటలు జట్టుపై ఎంత ప్రభావం చూపించాయో నిన్నటి ఫలితమే చెబుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా