ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలి

రాష్ట్రంలోని ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర రైతులు తరతరాలుగా వరి సాగు చేస్తున్నారని

Published : 05 Dec 2021 05:16 IST

ప్రధానికి మాజీ మంత్రి మండవ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర రైతులు తరతరాలుగా వరి సాగు చేస్తున్నారని, దాని వల్లనే తమకు గిట్టుబాటు ధర వస్తుందని రైతులు నమ్ముతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విధానం రైతులను అయోమయానికి గురిచేస్తోందన్నారు. యాసంగిలోనూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మరో లేఖలో మండవ సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని