పెరుగుతున్న చలి

రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తూర్పు, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా సోనాల(ఆదిలాబాద్‌ జిల్లా)లో

Published : 17 Jan 2022 04:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తూర్పు, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా సోనాల(ఆదిలాబాద్‌ జిల్లా)లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నూతనకల్‌(సూర్యాపేట జిల్లా)లో 7 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌(హైదరాబాద్‌)లో 6, మోతె(సూర్యాపేట)లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. సోమవారం నుంచి పగటిపూట పొడి వాతావరణం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని