Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 May 2024 20:59 IST

1. ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం: చంద్రబాబు

ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు పాల్గొనాల్సిన మాచర్ల సభ రద్దయింది. దీంతో ఆయన మాచర్ల ప్రజలనుద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ముస్లింలకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణం ఇచ్చాం. దుల్హన్‌ పథకం ఇస్తాం, రంజాన్‌ తోఫా ఇస్తాం. వైకాపా నేతలు పల్నాడు ప్రాంతాన్ని రక్తంతో తడిపేశారు. పిన్నెల్లి.. హత్యా రాజకీయాలు చేస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జూన్‌ 4 తర్వాత వారంతా పారిపోక తప్పదు: మోదీ

 తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం వద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని, భాజపాను గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది కాషాయ పార్టీని గెలిపించాలని సంకల్పం తీసుకున్నారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలనేది భాజపా కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. జియో ఫైబర్‌ యూజర్లకు కొత్త ప్లాన్‌.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు

జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ కస్టమర్ల కోసం జియో (Reliance Jio) కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. రూ.888తో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్‌ వస్తోంది. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ వినియోగదారులు ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నికలు భారత్‌లో జరుగుతుంటే.. పాకిస్థాన్‌ ప్రస్తావనెందుకు?: ప్రియాంక గాంధీ

 లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) భారత్‌లో జరుగుతుంటే.. పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తోందని భాజపాను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారంలో మతాలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకోవడం లేదని, స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న 4,44,216 మంది ఉద్యోగులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. మే 4 నుంచి నుంచి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగిందన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదు కాగా... అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 ఓట్లు పోలైనట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కేజ్రీవాల్‌ విడుదల.. తిహాడ్‌ జైలు వద్ద ప్రజలకు అభివాదం

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 28 వేల మొబైల్స్‌ బ్లాక్‌ చేయండి.. టెల్కోలకు డాట్‌ ఆదేశం

సైబర్‌ నేరాలతో సంబంధం ఉన్న 28,200 మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయాలని టెలికాం కంపెనీలను డాట్‌ (DoT) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, 20 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని సూచించింది. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోంశాఖ, డాట్, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన అనాలిసిస్‌లో వీటిని గుర్తించినట్లు డాట్ ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్‌ సమాధానమిదే..!

కొవిడ్‌ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు.. ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ అయిన గూగుల్‌ (Google) కూడా అందుకు మినహాయింపు కాదు. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది వందల సంఖ్యలో విడతలవారీగా తొలగింపులు చేపట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. డ్రాగన్‌ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్‌..!

ఛైనా (China) తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్‌ దీనిలో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. దీంతో ఆసియాలో అతిపెద్ద  విమాన వాహక నౌకను తయారుచేసిన దేశంగా రికార్డ్‌ సృష్టించింది. దీని ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు