Tata Motors: టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
Tata Motors Q4 results: టాటా మోటార్స్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మూడింతల లాభాన్ని నమోదుచేసింది.
Tata Motors Q4 results | ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో నాలుగో త్రైమాసికంలో రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,496.04 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి నమోదైంది.
గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,05,932.35 కోట్లుగా ఉన్న టాటా మోటార్స్ ఏకీకృత ఆదాయం.. ఈ ఏడాదిలో రూ.1,19,986.31 కోట్లకు చేరినట్లు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే కంపెనీ ఆదాయం 11శాతం పెరిగింది. పూర్తి వార్షిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.31,806.75 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే లాభం రూ.2,689.87 కోట్లకే పరిమితమైంది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఏకీకృత ఆదాయం కూడా పూర్తి సంవత్సరానికి రూ.4,37,927.77 కోట్లుగా నమోదైంది.
ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
ఈ ఏడాదిలో టాటా మోటార్స్ 73,800 ఈవీలను విక్రయించి 1.5 లక్షల మైలురాయిని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 48శాతం ఎక్కువ. ప్రయాణికులు, ఎస్యూవీ వాణిజ్య వాహన విభాగంలో విక్రయాలు ఊపందుకున్నాయి. ‘‘ 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు ఆర్జించాం. రానున్న ఏళ్లలోనూ ఇదే వృద్ధిని కనబర్చనున్నాం’’ అని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ అన్నారు. నాలుగో త్రైమాసికంలో కమర్షియల్, పీవీ, ఈవీ మూడు ఆటో విభాగాలు పుంజుకున్నాయని.. ముఖ్యంగా జాగ్వార్, ల్యాండ్ రోవర్ బలంగా పనితీరు కనబర్చాయన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు విలువ ఎన్ఎస్ఈలో 1.62శాతం పెరిగి రూ.1,047.00 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్‌దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.