దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (సీజేఎం) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని గురువారం సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు
వాదనలు వినిపించిన సీబీఐ
పిటిషన్‌పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (సీజేఎం) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని గురువారం సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అప్రూవర్‌గా మారేందుకు సీజేఎం కోర్టు ఉత్తర్వులిచ్చిందని, అవి సరైనవేనని చెప్పారు. దిగువ కోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రం, సాక్షుల వాంగ్మూలాల వివరాల రికార్డును సీల్డ్ కవర్లో హైకోర్టులో దాఖలు చేశారు. మరో వైపు దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతివ్వడంపై వివేక హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సీజేఎం ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. నేర నిరూపణకు సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. దస్తగిరి తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతిస్తూ క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ తీర్పును వాయిదా (రిజర్వు) వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?