గొర్రెలకు మేతగా పుచ్చతోట!

చిత్రంలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు నేతావత్‌ లీలమ్మ. ఈమెది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎర్రగడ్డ గ్రామం. రెండెకరాల్లో రూ.40వేల పెట్టుబడితో పుచ్చతోట సాగుచేశారు. చెమటోడ్చి పండించిన పంట కోతకొచ్చిన

Published : 23 Jan 2022 04:38 IST

చిత్రంలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు నేతావత్‌ లీలమ్మ. ఈమెది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎర్రగడ్డ గ్రామం. రెండెకరాల్లో రూ.40వేల పెట్టుబడితో పుచ్చతోట సాగుచేశారు. చెమటోడ్చి పండించిన పంట కోతకొచ్చిన సమయంలో ఇటీవల వడగండ్ల వాన కురిసింది. ఫలితంగా కాయలన్నీ పాడై మురిగిపోయాయి. చేసేదేమీ లేక తోటను గొర్రెలకు మేతగా వదిలేశారు. గత ఏడాది పుచ్చతోటపై రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చిందని ఈసారి కనీసం పెట్టుబడీ దక్కలేదని లీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.  

    

- ఈనాడు, వరంగల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని