ప్రగతిభవన్‌ ముట్టడికి వంట కార్మికుల యత్నం

వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులు శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. వివిధ జిల్లాల నుంచి విడతలుగా తరలి వచ్చిన కార్మికులను

Published : 29 Jan 2022 04:23 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులు శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. వివిధ జిల్లాల నుంచి విడతలుగా తరలి వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట, ఎస్‌.ఆర్‌.నగర్‌ ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం నేతలు బాబాయి, మంజుల, దేవరమ్మ, సరోజ తదితరులు మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా బడుల్లో వంట చేస్తున్నామని, గౌరవ వేతనం రూ.1000 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఇతర పనులకు వెళ్తే రోజుకు రూ.350 వస్తుందని చెప్పారు. అన్ని రంగాల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచుతున్న ప్రభుత్వం తమను విస్మరిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని