Playoffs: ఇంకా మూడు బెర్తులు.. ఏడు జట్లు పోటీ

టీ20లీగ్‌ దశ చివరికొచ్చేసింది. ఇక మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లు ఆరు మాత్రమే. అయితే ముంబయి, చెన్నై ఎప్పుడో రేసు నుంచి తప్పుకోగా.. ప్రస్తుతానికి అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్నది గుజరాత్‌ మాత్రమే. మరో మ్యాచ్‌ మిగిలుండగానే పది

Updated : 17 May 2022 09:43 IST

ముంబయి: టీ20లీగ్‌ దశ చివరికొచ్చేసింది. ఇక మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లు ఆరు మాత్రమే. అయితే ముంబయి, చెన్నై ఎప్పుడో రేసు నుంచి తప్పుకోగా.. ప్రస్తుతానికి అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్నది గుజరాత్‌ మాత్రమే. మరో మ్యాచ్‌ మిగిలుండగానే పది విజయాలు సాధించిన ఆ జట్టు అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించబోతోంది. ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్న రాజస్థాన్‌, లఖ్‌నవూ తలో 8 విజయాలతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. వాటి నెట్‌రన్‌ రేట్‌ (రాజస్థాన్‌ +0.304, లఖ్‌నవూ +0.262) కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో తమ చివరి మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ముందంజ వేయనున్నట్లే.

ఇక ఏడేసి విజయాలతో దిల్లీ (+0.255), బెంగళూరు (-0.323) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్‌లో బాగా వెనుకబడి ఉండటం బెంగళూరుకి ప్రతికూలత. దిల్లీ తన చివరి మ్యాచ్‌లో ముంబయిపై నెగ్గితే ఆ జట్టు ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్నట్లే,  బెంగళూరుకిదారులు మూసుకుపోయినట్లే. దిల్లీ ఓటమి పాలై, తన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడిస్తే  బెంగళూరు ముందంజ వేస్తుంది. కోల్‌కతా, హైదరాబాద్‌, పంజాబ్‌ గరిష్టంగా ఏడు విజయాలే సాధించగలవు. దిల్లీ, బెంగళూరు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే.. 7 విజయాలు సాధించిన మిగతా జట్లకు అవకాశం లభిస్తుంది. అప్పటికే రాజస్థాన్‌, లఖ్‌నవూలకు రెండు బెర్తులు ఖరారైపోతాయి కాబట్టి.. మిగతా వాటిలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు చివరి బెర్తును సొంతం చేసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని