రహస్య యాప్‌లు దాచేస్తారా?

ఫోన్‌లో ఎన్నెన్నో యాప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవైతే, మరికొన్ని వృత్తిపరమైన యాప్‌లు.

Updated : 30 Nov 2022 00:17 IST

ఫోన్‌లో ఎన్నెన్నో యాప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవైతే, మరికొన్ని వృత్తిపరమైన యాప్‌లు. లాక్‌స్క్రీన్‌ ఉండటం వల్ల వీటిని ఇతరులు చూడటానికి వీలుండదు. కానీ కొన్నిసార్లు ఫోన్‌ను అన్‌లాక్‌ చేయకుండా మరచిపోతుంటాం. అప్పుడు వేరేవాళ్లు యాప్‌లను వాడుకోవచ్చు. వాటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్‌ కావొచ్చు. మనం ఆయా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేసినా వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో యాప్‌లను హైడ్‌ చేసే ఫీచర్‌ బాగా ఉపయోగ పడుతుంది. దీని సాయంతో యాప్‌లను డిలీట్‌ చేయ కుండానే ఇతరుల కంట పడకుండా చూసుకోవచ్చు. అయితే ఇందుకోసం పాస్‌కోడ్‌ అవసరం. దీన్ని ఎంటర్‌ చేస్తేనే యాప్స్‌ను తిరిగి చూసుకోవటానికి వీలుంటుంది.

ఎనేబుల్‌ ఇలా..

* ముందుగా ఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి.
* కిందికి స్క్రోల్‌ చేసి, ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* ప్రైవసీ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
* ప్రైవసీ ప్రొటెక్షన్‌ ట్యాబ్‌లో హైడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
* ప్రైవసీ పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.
* హైడ్‌ చేయాలనుకుంటున్న యాప్స్‌ను ఎంచుకోవాలి.
* యాప్స్‌ను హైడ్‌ చేయటానికి పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేయటం తప్పనిసరి. దీని మొదటి అక్షరం చి గా ఉండేలా చూసుకోవాలి.
* ఈ పద్ధతిలో రహస్య యాప్‌లు ఇతరులకు కనిపించకుండా దాచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని