వాట్సప్‌ అవతార్‌!

వాట్సప్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌కు బదులు మన అవతార్‌ను సృష్టించుకుంటే? మనల్ని వ్యక్తం చేసుకోవటానికి బాగుంటుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వాట్సప్‌ కొత్తగా అవతార్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఇప్పటికే కొందరు బీటా టెస్టర్ల కోసం ప్రత్యేకించిన ‘అవతార్ల’ను ప్రవేశపెట్టింది.

Published : 26 Oct 2022 00:15 IST

వాట్సప్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌కు బదులు మన అవతార్‌ను సృష్టించుకుంటే? మనల్ని వ్యక్తం చేసుకోవటానికి బాగుంటుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వాట్సప్‌ కొత్తగా అవతార్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఇప్పటికే కొందరు బీటా టెస్టర్ల కోసం ప్రత్యేకించిన ‘అవతార్ల’ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ప్లేస్టోర్‌ నుంచి వాట్సప్‌ బీటాను అప్‌డేట్‌ చేసుకున్న తర్వాత కొందరికి ఈ అవతార్‌ను సృష్టించుకునే అవకాశం కల్పించింది. అవతార్‌ను సృష్టించుకున్నాక వాట్సప్‌ వెంటనే దీనికి సంబంధించిన కొత్త స్టికర్‌నూ రూపొందిస్తుండటం గమనార్హం. దీన్ని ఆత్మీయులతో షేర్‌ చేసుకోవచ్చు. కావాలంటే అవతార్‌ను ప్రొఫైల్‌ పిక్చర్‌గానూ వాడుకోవచ్చు. వచ్చే కొద్దివారాల్లో మరింత ఎక్కువమందికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. గ్రూప్స్‌లో 1,024 వరకు మందిని చేర్చుకోవటానికి తోడ్పడే ఫీచర్‌నూ వాట్సప్‌ ఇటీవల కొందరు బీటా టెస్టర్లకు అందించింది. ఎవరైనా ఈ ఫీచర్‌ తమ ఫోన్‌లో అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే కొత్త గ్రూప్‌ను క్రియేట్‌ చేసి పరీక్షించుకోవచ్చు. లేదూ అప్పటికే ఉన్న గ్రూప్‌లో భాగస్వాములను చేర్చుకోవటం ద్వారానూ తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని