యూట్యూబ్‌ ‘ప్రైమ్‌టైమ్‌’!

యూట్యూబ్‌ కొత్తగా ‘ప్రైమ్‌టైమ్‌ ఛానెల్స్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు, ఆటలను స్ట్రీమింగ్‌ సర్వీసుల నుంచి నేరుగా చూసుకోవటానికిది వీలు కల్పిస్తుంది.

Updated : 09 Nov 2022 09:56 IST

యూట్యూబ్‌ కొత్తగా ‘ప్రైమ్‌టైమ్‌ ఛానెల్స్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు, ఆటలను స్ట్రీమింగ్‌ సర్వీసుల నుంచి నేరుగా చూసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. దీని తొలి వర్షన్‌ను అమెరికాలో ఆరంభించారు. త్వరలోనే ఇతర దేశాలకు విస్తరించే అవకాశముంది. ఇందులో కొనుక్కోవటానికి 30కి పైగా ఛానెళ్లు ఉన్నాయి. అద్దెకు, ఉచితంగా లభించే సినిమాలు, షోలు కూడా అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్‌లో సైన్‌ఇన్‌ కాగానే ప్రైమ్‌టైమ్‌ ఛానెల్స్‌ అంశాలూ కనిపిస్తాయి. ఈ ఫీచర్‌ హోంపేజీల్లో ఆయా షోలు, సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, షూటింగ్‌ చేసిన తీరు, నటుల ఇంటర్వ్యూలు సైతం దర్శనమిస్తాయి. యూట్యూబ్‌ రికమెండేషన్స్‌లోనూ ప్రైమ్‌టైమ్‌ ఛానెల్స్‌ షోల సమాచారముంటుంది. దీని ద్వారా ఇష్టమైన అంశాలను ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని