కొత్త కూత!

సామాజిక మాధ్యమ యాప్‌లో ఎప్పుడూ ఒకే ప్రొఫైల్‌ ఫొటోను చూసి బోర్‌ కొడుతోందా? ఓ పది ఫొటోలను ఎంచుకుంటే, అవి ఒక దాని తర్వాత మరోటి మారుతుంటే బాగుంటుంది కదా! అయితే దేశీయ మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘కూ’ యాప్‌ను ప్రయత్నించి చూడండి.

Published : 16 Nov 2022 00:26 IST

సామాజిక మాధ్యమ యాప్‌లో ఎప్పుడూ ఒకే ప్రొఫైల్‌ ఫొటోను చూసి బోర్‌ కొడుతోందా? ఓ పది ఫొటోలను ఎంచుకుంటే, అవి ఒక దాని తర్వాత మరోటి మారుతుంటే బాగుంటుంది కదా! అయితే దేశీయ మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘కూ’ యాప్‌ను ప్రయత్నించి చూడండి. పది ఇమేజ్‌లను ప్రొఫైల్‌ ఫొటోలుగా అప్‌లోడ్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఇటీవల ఆరంభించిన నాలుగు కొత్త ఫీచర్లలో ఇదొకటి. ఎవరైనా మన ప్రొఫైల్‌ ఫొటోలను చూస్తున్నప్పుడు అవి  స్లైడ్‌ షో మాదిరిగా మారిపోతుంటాయి. ఇప్పుడు కూలో అవతలివారికి మెసేజ్‌లు చేరాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవచ్చు. పలు ఐడియాలను ఒకేసారి రాసుకొని, వేర్వేరు సమయాల్లో పంపాలని అనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది. డ్రాఫ్ట్‌ మెసేజ్‌ను సేవ్‌ చేసుకునే ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది. ఏదైనా పోస్ట్‌ను ముందే సిద్ధం చేసుకొని, అవసరమైనప్పుడు సవరించుకొని, పంపించుకోవటానికి ఈ ఫీచర్‌ తోడ్పడుతుంది. లైక్‌, కామెంట్‌, రీ-కూ, షేర్‌ వంటివే కాదు.. ఇప్పుడు కూను సేవ్‌ చేసుకోవచ్చు కూడా. కేవలం కూ యూజర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. వీటిని తమ ప్రొఫైల్‌ పేజీ ద్వారా చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని