డిజిటల్‌ న్యూస్‌రీడర్‌!

టీవీలో వార్తలను చూస్తూనే ఉంటాం. మరి వాటిని చదివే వారు నిజమైన మనుషులు కాకపోతే? కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే డిజిటల్‌ రూపాలైతే? ప్రపంచంలోనే అలాంటి మొట్టమొదటి న్యూస్‌ యాంకర్‌ను చైనా వార్తాసంస్థ షిన్వా ప్రవేశపెట్టింది.

Published : 16 Nov 2022 00:28 IST

టీవీలో వార్తలను చూస్తూనే ఉంటాం. మరి వాటిని చదివే వారు నిజమైన మనుషులు కాకపోతే? కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే డిజిటల్‌ రూపాలైతే? ప్రపంచంలోనే అలాంటి మొట్టమొదటి న్యూస్‌ యాంకర్‌ను చైనా వార్తాసంస్థ షిన్వా ప్రవేశపెట్టింది. తరచూ వార్తలను చదివే ఒక న్యూస్‌ రీడర్‌ డిజిటల్‌ రూపంతో దీన్ని సృష్టించారు. చైనీస్‌, ఇంగ్లిష్‌ భాషల్లో మాట్లాడే ఈ రూపం ప్రత్యక్ష వీడియోల ద్వారా తనకు తానే నేర్చుకుంటుంది. సిస్టమ్‌లో టైప్‌ చేసిన అంశాలను నిపుణులైన న్యూస్‌రీడర్‌ మాదిరిగానే చదువుతుంది. గొంతు, ముఖ కవళికలు, హావభావాలు అన్నీ సహజంగానే ఉంటాయి. రోబో మాదిరిగా కృత్రిమంగా కనిపించవు. అలసట అన్నదే లేకుండా 24 గంటలూ పనిచేస్తుంది. డిజిటల్‌ యాంకర్‌ చదువుతున్న రెండు వార్తలను షిన్వా ట్విటర్‌లోనూ పెట్టింది. ‘‘దేశంలోని పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏఐ యాంకర్‌ అభివృద్ధి దశలో ఉంది. ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందనే విషయం నాకు తెలుసు’’ అని ఇది వార్తలను ముగించటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు