Twitter Down: గంటకుపైగా నిలిచిపోయిన ట్విటర్‌ సేవలు!

ట్విటర్‌లో (Twitter) మళ్లీ ఏదో సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి 6.55 గంటల నుంచి 7.15 వరకు ట్విటర్‌ పని చేయలేదు. అయితే జియో యూజర్లకే ఈ సమస్య వచ్చిందని సమాచారం. 

Updated : 11 Dec 2022 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్‌ (Twitter) మరోసారి మొరాయించింది. ఆదివారం సాయంత్రం 6.55 గంటల నుంచి 8.15 వరకు ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు డౌన్‌ డిటెక్టర్‌లో ఫిర్యాదు కనిపించాయి. ఇటీవల కాలంలో ట్విటర్‌ తరచూ మొరాయిస్తోంది. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్విటర్‌ సేవలు ఇలా నిలిచిపోతున్నాయని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ట్విటర్‌లో సమస్య కనిపించింది. 

Nothing to see here, Something went wrong. Try reloading... గత కొన్ని రోజులుగా ట్విటర్‌లో అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్‌లు కనిపిస్తూ వస్తున్నాయి. వాటి అర్థం ట్విటర్‌ సేవలు యూజర్లకు అందుబాటులో లేవు అని. తాజాగా ఇవే మెసేజ్‌లు ఆదివారం కూడా కనిపించాయి. దీంతో యూజర్లు మరోమారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ బ్లూ టిక్‌ సేవలు మళ్లీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలా సాంకేతిక సమస్య రావడం గమనార్హం. తాజా సమస్యపై ట్విటర్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ సమస్య మన దేశంలో జియో నెట్‌వర్క్‌ వాడేవాళ్లకే వచ్చిందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని